Apologies for non-Telugu folks. This is a poem that I wrote probably way back in 2007 that came up when I was clearing my office today. Hope you like it.
ఎందుకో తెలియని ఆందోళన, ఎవరి కోసమో ఈ తపన
మనసు పొరలందున ఎవరిదో ఆలాపన
యద లోయలలో ఎవరో తెలియకుండ కదులుతున్న
అర్థం కాక నేను నిత్యం సతమతవుతున్న...
నిత్యం నీవే జ్ఞాపకాలు, వద్దని చెపితే వినేనా సంకెళ్ళు వేయలేని నా మది విహారం
కనుల ముందు నుండి చేరిగిపోవుగా స్మృతులు
దరికి రానివ్వవు కదా నా చెంచాలమయిన మదికి విరామం
ఇది నన్ను వెళ్ళిన నీదా తప్పు? లేక నీ ప్రేమనే సర్వస్వం అనుకున్న నాదా?
అర్థం కాక నేను నిత్యం సతమతవుతున్న...