నిశిరాతిరి వేళ చంద్రుని కాంతిలో
సముద్రము చెంత నీ కాంతతో
కడలి అలల సవ్వడి వింటూ
కమ్మని కలలని కంటూ
కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ
నీ కాంత కురులు మేలి వేస్తూ
సరదాగా మరదలు నువ్వు గడుపుతున్న ఈ తరుణంలో
ఈ నీ ఆప్త మిత్రుని కొన్ని మాటలు వినవా?
ఏది నీకు ఎక్కువ, ఈ రాజినికంతుని వెన్నెల ?
లేక నిన్ను మైకంలోకి నెడుతున్న నీ సునీల?
బదులు చెప్పనక్కేర్లేదు, ఏదో నాకు తెలుసు
ఆ కడలి అలలు నీ మదిలో రేగుతున్న సంగతి నాకు తెలుసు
అది నీ పక్కనే ఉన్న సునీల కారణమని తెలుసు
కోరుకుని కట్టావురా నువ్వు తాళి
మంగళ వాద్యాల పెళ్ళితో వచ్చింది ఈ ఆళి
చేస్తుంది తొందరలో నీ జేబు ఖాళి
కష్టపడి మల్లి జేబు నింపు
మళ్ళి తనని శోప్పింగ్కి పంపు :)
చిన్ననాటి ఆ మమకారం
వేసింది మీ పెళ్ళికి స్వీకారం
ఆ బందం కలకాలం మీ అనురాగం నిలుపాలని ఆసిస్తూ...
2 comments:
This is the most beautiful gift i ever received. I don't even know how many time i read this :)
Thanks Suri bhai..
you deserve it Sree! :)
Post a Comment